భారీగా వరద వస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి
తెలంగాణ, జూలై 13, చాటింపు: ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ ప్రాజెక్ట్ కు, నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద వదిలిన నేపథ్యంలో నది తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని మంత్రి కోరారు. అన్ని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని విద్యుత్ ప్రాజెక్టులన్నింటిలో పవర్ జనరేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు. ఇన్‌ఫ్లో పెరగడం వల్ల నారాయణపూర్ డ్యాం నుంచి కృష్ణా నదికి బుధవారం రాత్రి 7.00 గంటలకు 1,33,188 క్యూసెక్కుల విడుదల చేసినట్లు సమాచారం అందిందని ఎగువన, నదీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూరాలకు ఇన్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్, నారాయణపేట కలెక్టర్లు వెంకట్రావు, హరిచందనతో పాటు పోలీసు అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేసినట్లు మంత్రి వివరించారు. అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలో నదీ తీరాన ఉన్న పలు గ్రామాల ప్రజలకు ఎగువ నుంచి వస్తున్న వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి అన్ని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టాలని ఇరిగేషన్ జెన్ కో అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
uppari