భారీ వర్షాలు.. ఈ-సెట్ పరీక్ష వాయిదా
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు.
- By khaja --
- Tuesday, 12 Jul, 2022
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పలు యూరివర్సిటీలు సైతం పరీక్షలను వాదాయి వేశాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది.ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబ్రాది తెలిపారు. అయితే, 14న నుంచి జరిగే ఎంసెట్ మాత్రం యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహించబోయే తేదీని ప్రకటించనున్నట్లు వివరించారు.
khaja