భారతదేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి వర్ధంతి*
భారతదేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్బంగా నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన
- By khaja --
- Friday, 27 May, 2022
భారతదేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్బంగా నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన వరంగల్ & హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు. ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటానికి జవహర్‌లాల్ నెహ్రూ ఎంతో కృషి చేశారని, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి పోరాడిన భారత జాతీయ కాంగ్రెస్ (INC) యొక్క ముఖ్య నాయకులలో ఆయన ఒకరని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా చైర్మన్ పింగిళి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులూ మహమ్మద్ అంకూస్, బొంత సారంగం, టీపీసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ ఇప్ప శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు జాఫర్, ఒల్లెపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
khaja