తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్న ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయనున్న సందర్భంగా హాలియా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ
- By khaja --
- Friday, 29 Apr, 2022
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయనున్న సందర్భంగా హాలియా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకులు అబ్దుల్ హలీమ్ గారు మీడియా సమావేశం ఏర్పాటు పరిచి తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున 1500 మంది సభ్యులకు దావతే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
జరగబోయే ప్రభుత్వ విందు కార్యక్రమానికి వివిధ మండలాల నుండి ముస్లిం సోదరులను ఆ యొక్క గ్రామాల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మసీద్ కమిటీలను సమన్వయ పరుచుకుని జరగబోయే విందు కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో తరలించి దిగ్విజయం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాత్ ఖాన్, షేక్ మక్బూల్, మండల కో ఆప్షన్ షేక్ మున్న, అనుముల మండలం టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ గౌస్, మండల ఉపాధ్యక్షులు షేక్ అజ్గర్, హజారి గూడెం ఉప సర్పంచ్ షేక్ జలీల్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
khaja