గుండాల గ్రామంలో అంతర్జాతీయ చిరుధాన్యాల రోడ్ షో
గుండాల గ్రామంలో అంతర్జాతీయ చిరుధాన్యాల రోడ్ షో
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గ్రామంలో శుక్రవారం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 రోడ్ షో నిర్వహించారు. రైతులను చిరుధాన్యాలు పండించవలసిందిగా కోరారు. రాబోయే కాలంలో చిరుధాన్యం పంటలే ముఖ్య ఆహార పంటలు అవుతాయని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగుబాయి, మాజీ ఎంపిటిసి మోతిరాం, అశోక్, ఆశ వర్కర్స్, అంగన్వాడీలు, విద్యార్థులు, రైతులు, ఏఈఓ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA