అడ ప్రాజెక్టు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్.
అడ ప్రాజెక్టు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్.
అసిఫాబాద్ : అడ ప్రాజెక్టు కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని అడ ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను టూరిజం అధికారి రామకృష్ణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడ ప్రాజెక్టు కింద జెట్టి బోటుతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు 3 కాటేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయనున్న స్ప్రింగ్ వంతెన కొరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, పర్యాటకుల సౌకర్యార్థం ఒక రెస్టారెంట్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులకు కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA