అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్ బిల్లా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు టి.బి వ్యాధిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అనంతరం కౌన్
- By khaja --
- Tuesday, 29 Mar, 2022
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్ బిల్లా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు టి.బి వ్యాధిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ టి. బి. నివారణలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం పేద వారికి వైద్యం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. టీబీ ద్వారా బాధపడుతున్నవారు అధైర్య పడవద్దని తెలిపారు.అనంతరం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ దానమ్మ, ఆయమ్మ ప్రియాంక,ఎస్.సి సెల్ రాష్ట్ర నాయకులు ఆదాసు విక్రమ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
khaja