BJP తర్వాతి టార్గెట్ KCR: యూపీ బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయి

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పావులు బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయని రాజాసింగ్ అన్నారు.

యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ తదుపరి టార్గెట్ కేసీఆర్ ను గద్దెదించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం అనూహ్యంగా ఇక్కడ బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ బీజేపీ దూకుడు పెంచనుందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..

యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురై, కేసులను సైతం ఎదుర్కొంటున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. యూపీ ఫలితాల తర్వాత మరోసారి తన నోటికి పనిచెప్పారు. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని.. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజసింగ్ అన్నారు.

khaja

Comment As:

Comment (0)