RBI

డిగ్రీ అర్హతతో ఆర్‌బీఐలో 950 ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు..

ఆర్‌బీఐ త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు...

రిజర్వర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 8 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rbi.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

  • ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ఉన్నాయి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 17, 2022
  • దరఖాస్తులకు చివరి తేది: మార్చి 08, 2022
  • ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ: మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://rbi.org.in/

Comment As:

Comment (0)