minacollege

కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శాసన మండలి ఛైర్మన్

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మొత్తం నల్గొండ జిల్లాలోనే గత రెండు సంత్సరాలుగా కరోనా టైంలో కూడా నిలదొక్కుకుని విద్యను అందిస్తున్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మీన కాలేజ్ అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను అని అన్నారు.

ఉచిత విద్యతో పాటు ఉచిత భోజనంతో పాటు ఉచిత ట్రాన్స్ పోర్ట్ అందిస్తున్న ఒకే ఒక్క కాలేజ్ ఈ మీన ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న చైర్మన్ మొహమ్మద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విద్య సంస్థ ఈ నల్గొండ జిల్లాలో ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను అన్నారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ఈ కాలేజ్ నుండి ప్రతిభ కనబరుస్తున్న ప్రతి విద్యార్తులకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. కష్టపడి ఏ పని చేసినా చదివిన మంచి భవిష్యత్ వుంటుంది అని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసన సభ్యులు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఆర్. డి. ఓ రోహిత్ సింగ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మగ్దుం భాషా, కాలేజ్ చైర్మన్ మొహమ్మద్ అలీ, కాలేజ్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Comment As:

Comment (0)