ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతం, సమస్యలు పరిష్కరించాలి
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్మిక సంఘం నా
- By V.VKR --
- Friday, 15 Jul, 2022
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్మిక సంఘం నాయకులు కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, సిఐటియు నగర కార్యదర్శి ఎం.విజయ్,సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణ హాజరై మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీవో నెంబర్ 549 ప్రకారం జీతం రూ.16వేలు ఇవ్వాలని అన్నారు.కానీ ఏజెన్సీ వారు హాజరు తక్కువ చేసి ఇష్టం వచ్చినట్లు తక్కువగా జీతాలు వేస్తున్నారని అన్నారు.ఈఎస్ఐ,ఈపీఎఫ్, వర్క్ మెటీరియల్,సేఫ్టీ మెటీరియల్,ఐడెంటి కార్డు లు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక శాఖ అధికారి జోక్యంతో తన ఛాంబర్ లో కార్మిక నాయకులు,హాస్పిటల్ అధికారులు,ఏజెన్సీ వారితో చర్చలు జరిపారని చెప్పారు.ఈ చర్చలలో ఏజెన్సీ వారు వారం లోపల 2నెలల జీతాలు ఇస్తామని, హాజరుకు తంబుతో పాటు రిజిస్టర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు,అగ్రిమెంట్ ప్రకారం రూ.16వేలు జీతం, ఈఎస్ఐ,ఈపీఎఫ్,తక్కువ వచ్చిన వారు, అసలు రానివారు మా దృష్టికి తెస్తే పరిశీలించి పరిష్కరిస్తామని,రోస్టర్ వారం లోపల వేస్తామని ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది.కానీ ఈ విషయంలో కార్మిక శాఖ అధికారులు హామీ ఇస్తే ఒప్పు కుంటామని కార్మిక నాయకులు తెలిపారు. కనీసం పొరక,మాబు కర్ర,డ్రస్సు,ఐడెంటి కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. డిసిఎల్ జోక్యం చేసుకొని వచ్చే వాయిదా లోపల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ వారికి చెప్పడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.రామకృష్ణ, అబ్దుల్ దేశాయి,హాస్పిటల్ పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు సుజాత, కె.లక్ష్మి,ఉరుకుందమ్మ, లక్ష్మీదేవి,మురళి,డి.సురేష్, టి.మహేష్,ఆశీర్వదమ్మ, వరలక్ష్మి,మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
V.VKR