విద్యుత్ తీగలతో గ్రామస్తుల ఇబ్బందులు
విద్యుత్ తీగలు దగ్గరగా ఉండటం వలన గాలి దుమారానికి ఒకదానికి ఒకటి తగిలే అవకాశాలు ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ఉపకరణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని దీంతో విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అంటున్నారు.
విద్యుత్ తీగలు దగ్గరగా ఉండటం వలన గాలి దుమారానికి ఒకదానికి ఒకటి తగిలే అవకాశాలు ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ఉపకరణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని దీంతో విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అంటున్నారు. లింగపూర్ మండలంలోని గుంసూర్ బి గ్రామంలో విద్యుత్ తీగలు చాలా దగ్గరగా ఏర్పాటు చేశారు. ఈ సమస్యను ఇప్పటికే స్థానిక సర్పంచ్, విద్యుత్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టాలని ఆదివారం గుంనూర్ బి గ్రామస్తులు కోరుతున్నారు.
KOTA SAIKRISHNA