రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేత‌నాలు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

హైద‌రాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేత‌నాలు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. కూలీల హాజరు, పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వందరోజుల పని కల్పించాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయంపూటే పనులను చేయించాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

khaja

Comment As:

Comment (0)