నేటి నుంచి నిజామాబాద్ To తిరుమలకు ఆర్టీసీ బస్సులు
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సర్వీసుకు జెండాఊపి ప్రారంభించనున్నారు
- By khaja --
- Friday, 08 Jul, 2022
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సర్వీసుకు జెండాఊపి ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సులో తిరుమల వెళ్లే భక్తులకు బస్ టికెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్ అందిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. కనీసం వారం ముందు www.tsrtconline.in నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ సేవలు మొదలైన విషయం తెలిసిందే.
khaja