వివాహేతర సంబంధం: దారుణ హత్య
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అల్లవారిపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది
- By khaja --
- Tuesday, 26 Jul, 2022
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అల్లవారిపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మహిళ గత కొంత కాలంగా అల్లవారిపాలెంకు చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. రాత్రి సమయంలో ఇరువురు మహిళ ఇంటికి రావడంతో వివాదం చోటుచేసుకుంది. ఇరువురు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. హత్య స్థలాన్ని గుడివాడ డిఎస్పి సత్యానందం పరిశీలించగా, హత్యకు కారణంగా భావిస్తున్న వ్యక్తితో పాటు ,మహిళా పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన తోట్లవల్లూరు పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు...!!
khaja