ఆర్ డి ఎస్ ఆనకట్ట వరద ఉధృతిని పరిశీలనతీర ప్రాంతాల ప్రజలు నది లోకి వెళ్ళవద్దు... అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు పథకం) ( రాజోలి బండ డైవర్షన్ స్కీం ) ఆనకట్టను సందర్శించి

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు పథకం) ( రాజోలి బండ డైవర్షన్ స్కీం ) ఆనకట్టను సందర్శించి జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మంగళవారం వరద ఉధృతిని పరిశీలించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఏలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పడు బార్డర్ పోలీసులతో సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.తుంగభద్ర డ్యాం నుండి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్ కు వరద నీరు చేరుతుండడంతో అదే స్థాయిలో దిగువనున్న సుంకేసుల బ్యారేజీకి వరద నీరు చేరుతుందని,నది తీర ప్రాంతాల ప్రజలు నదిలోకి వెళ్ళకుండా అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ , కోసిగి సిఐ ఎరిషావలి, కోసిగి ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)