రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం
సి.ఎం.జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి అరోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైందనీ కర్నూలు పార్లమెంట్ టి.డి.పి
- By V.VKR --
- Wednesday, 13 Jul, 2022
సి.ఎం.జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి అరోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైందనీ కర్నూలు పార్లమెంట్ టి.డి.పి. అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం వారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పట్టణానికి వెళ్లాలన్నా, గ్రామాలకు వెళ్లాలన్న ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం కష్టంగా ఉందనీ,మెయిన్ రోడ్లు మొదలుకొని,అన్ని రోడ్ల పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉందనీ, ఎక్కడచూసిన రోడ్లు గుంతలమైనట్లు చెప్పారు. కనీసం వాటిని పూడ్చివేసే స్థితిలో కూడా జగన్ ప్రభుత్వం లేదని ఆయన అన్నారు.రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలలో ఏ ఒక్కరు కూడా సురక్షితంగా లేరనీ, ప్రతి ఒక్కరు బాదలను అభవిస్తున్నారనీ పేర్కొన్నారు.ఒక అవకాశం ఇవ్వమన్నందుకు ఓటు వేసినందుకు ప్రజలు భాదలు ఎదుర్కొనుచున్నారని తెలిపారు,మీకు రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి తెలియాలంటే ఒకరోజైనా ఎర్రబస్సు ఎక్కి ప్రయాణిస్తే రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి మీకు అర్ధమౌతుందని అన్నారు.కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలోని రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించి ప్యాచింగ్ పనులైనా పూర్తిచేయాలని కోరారు.
V.VIJAY KUMAR