వైద్యారోగ్య శాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా రూ.5వేలు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3వేలు కాగా, దీన్ని రూ.5వేలకు పెంచాలి.సహజ ప్రసవం అయినా, సిజేరియన్‌ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలి.సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదే.

khaja

Comment As:

Comment (0)