రేపు అల్పపీడనం

హైదరాబాద్‌: ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల

హైదరాబాద్‌: ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

khaja

Comment As:

Comment (0)