మానవత్వం చూపిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ బి.సునీల్
అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మానవత్వం ప్రదర్శించారు.కళ్లెదుటే జరిగిన రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మన్ననలు పొందారు. ఓ కేసు విచారణలో భాగంగా ఆయన ఆదివారం విశాఖ వచ్చారు
విశాఖపట్నం, జూలై 17: అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మానవత్వం ప్రదర్శించారు.కళ్లెదుటే జరిగిన రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మన్ననలు పొందారు. ఓ కేసు విచారణలో భాగంగా ఆయన ఆదివారం విశాఖ వచ్చారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి ఒక రోడ్ ప్రమాదం జరగడాన్ని చూశారు. ముగ్గురు పిల్లలు ఈ ప్రమాదంలో గాయపడి బాధపడుతున్నారు. చలించిపోయిన డీఎస్పీ సునీల్ తక్షణమే స్పందించి పోలీస్ వాహనంలో క్షతగాత్రుల్ని విశాఖ పెద్దాసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి తక్షణ చికిత్సకు ప్రోత్సహించారు. ఆయన ప్రదర్శించిన దాతృత్వాన్ని అక్కడున్న వారంతా అభినందించారు.
రిపోర్టర్ హరి