మద్దికెరలో తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళశాల ఏర్పాటుచేయాలిఅబ్దుల్లా,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
కర్నూలు జిల్లా,మద్దికేర మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో బుధవారం టౌన్ మోడల్ కాలేజ్,ఆర్ ఐ ఓ కార్యాలయంలో ఆర్ ఐ ఓ (బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జిల్లా
- By V.VKR --
- Wednesday, 13 Jul, 2022
కర్నూలు జిల్లా,మద్దికేర మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో బుధవారం టౌన్ మోడల్ కాలేజ్,ఆర్ ఐ ఓ కార్యాలయంలో ఆర్ ఐ ఓ (బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జిల్లా అధికారి)గురువయ్యా సెట్టీని కలిసి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా మద్దికేరలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు.ఉద్యమాల ఫలితంగా గత రెండు సంవత్సరాల క్రితం మద్దికేరలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు.కానీ ఇప్పటివరకు జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు.స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు.కానీ ఎంపీసీ గ్రూప్ ను మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు.అలా కాకుండా ఎంపీసీ గ్రూప్ తో పాటు మిగతా గ్రూపులైన బైపిసి,సిఇసి,హెచ్ఈసి గ్రూపులో కూడా వచ్చే విధంగా చూడాలని ఆర్ఐఓకి వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు .ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు వినోద్, తదితరులు పాల్గొన్నారు.
V.VKR