బండి సంజయ్ రేపు మౌన దీక్ష
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష చేపట్టనున్నారు.ధరణి పోర్టల్ లో లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలంటూ బీజేపీ దీక్షకు
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష చేపట్టనున్నారు.ధరణి పోర్టల్ లో లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలంటూ బీజేపీ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ, చేరకల కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలక్ష్మీ గార్డెన్స్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష నిర్వహించారు. తన పుట్టిన రోజు అయినప్పటికీ మౌనదీక్షలో పాల్గొంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
spr sp express