పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి

సుందరయ్య త్యాగం మహోన్నతమని అయన స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సందర్బంగా నర్సంపేట పట్టణం లోని వరంగల్ రోడ్డు

సుందరయ్య త్యాగం మహోన్నతమని అయన స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి సందర్బంగా నర్సంపేట పట్టణం లోని వరంగల్ రోడ్డు కూడలి వద్ద అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళిలు అర్పించారు.ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని కొనియాడారు. రైతు కూలీ ఉద్యమాలు నిర్మించాడని, విద్యార్థి సంఘాల నిర్మాతగా మార్క్సిస్టు నేతగా ఎదిగాడన్నారు. దక్షిణ భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా నిలిచాడు. అనేక భూ పోరాటాలు నడిపినాడు. కులవివక్షతను రూపుమాపాలని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉన్నత కుటుంబం లో పుట్టి అయన వాటా కి వచ్చిన ఆస్థిని కూడా పేద ప్రజలకు పంచిన గొప్ప నాయకుడని అన్నారు.దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమన్ని నిర్మించిన నాయకుడని అన్నారు. దోపిడి పీడన లేని రాజ్యంకై, కలగన్నాడు. స్వతంత్రం తర్వాత అందరికీ తిండి కూడు గుడ్డ కనీస అవసరాలు కల్పించాలని ఆశించాడు. అలాంటి మహనీయుడు 37 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన మరణం ఒక కమ్యూనిస్టులకే, కాదు సమస్త పీడిత ప్రజలకు దుఃఖాన్ని మిగిల్చింది. మానవ సేవ కై చివరి వరకు అంకితమయ్యాడు. అలాంటి వ్యక్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఈ దేశ నిర్మాణంలో స్వతంత్ర రాజకీయాలలో నిలబడాలని దోపిడి పీడన లేని వ్యవస్థ కోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుజ్జుల ఉమా, అనంతగిరి రవి, పట్టణ నాయకులు, గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, గుజ్జుల వెంకన్న,నాయకులు, ఫారిదా, సింగారపు బాబు, వజ్జంతి విజయ, గణిపాక ఇంద్ర, ఉదయగిరి నాగమణి, జగన్నాధం కార్తీక్, విలియం కేరి, తదితరులు పాల్గొన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)