పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,విద్యుత్ ఛార్జ్ లు పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్యర్వంలో తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,విద్యుత్ ఛార్జ్ లు పెంపుకు నిరసనగా మరియు యాసంగి లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టి,పెద్ద ఎ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్యర్వంలో తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,విద్యుత్ ఛార్జ్ లు పెంపుకు నిరసనగా మరియు యాసంగి లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టి,పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కలసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. మరియు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీలు తగ్గించాలని,లేనిపక్షంలో పోరాటాలకు పునాది వేస్తామన్నారు. యాసంగిలో పండించున ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆపి వెంటనే మద్దతు ధర ప్రకటించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బద్రి నాయక్, బాలు నాయక్, శ్రీనివాస్ రెడ్డి,నాగేందర్ నాయక్, కేలావత్ నగేష్ నాయక్, శ్రీధర్ రెడ్డి, చిట్టి, వెంకటేశ్వర్లు, సైదులు, నారాయణ రెడ్డి,వెంకన్న, హచ్చు నాయక్, నాగ, సరిరాం, అనిల్, సాలయ్య, సైదారావు, రమేష్, పాండు నాయక్,లక్ష్మా నాయక్, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)