పిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతంను భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. పలు విషయాలపై చర్చించారు.

పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతంను భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలవేసి శాలువాతో సత్కరించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా NSUI అధ్యక్షుడు మంగ ప్రవీణ్, భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, INTUC భువనగిరి పట్టణ అధ్యక్షులు దండు నరేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల మనోజ్ కుమార్, NSUI జిల్లా కార్యదర్శి సిరిపంగ చందు, బిడుద హరిరాజు, మాటూరి బాళేశ్వర్ పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)