పాఠశాలల బంద్ విజయవంతంఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ ( ఏబీవీపీ ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం నగరంలోని పాఠశాలల బంద్ విజయవంతం అయినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ కుమార్ పేర్కొన్నారు
- By V.VKR --
- Tuesday, 19 Jul, 2022
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ ( ఏబీవీపీ ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం నగరంలోని పాఠశాలల బంద్ విజయవంతం అయినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు బంద్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ,ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు సంహరించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపివేయాలి,జీవో నెంబర్ 117 వెంటనే రద్దు చేయాలి.ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ త్వరితగతిన అందించాలని కోరారు. డీఎస్పీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1:3 నిష్పత్తిలో ఖాళీగా ఉన్న 24 వేలకు పైగా టీచర్ పోస్టులను వెంటనే భరించాలి.నాడు నేడు పేరుతో పాఠశాలల పనుల్లో జరుగుతున్న అవినీతిపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజు దోపిడీని అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి,ఎయిడెడ్ పాఠశాలలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ నిర్వహించాలని అన్నారు. ప్రమాణాలు లేని కార్పొరేట్, ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి వాటిపై చర్యలు చేపట్టాలని అయన తెలిపారు.
V.VKR