నిత్య సాధన తోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు,,రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి..
విద్యార్థులు నిత్యం క్రమశిక్షణతో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్.నగర్ లోని పార్క్ లో ఏవి అకాడమీ ఆధ్వర్యంలో
- By V.VKR --
- Tuesday, 19 Jul, 2022
విద్యార్థులు నిత్యం క్రమశిక్షణతో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్.నగర్ లోని పార్క్ లో ఏవి అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరాటే బెల్ట్ గ్రీటింగ్ టెస్టుకు రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. కరాటే సాధనకు తమ పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల పాత్ర అభినందనీయమన్నారు. ఏవి అకాడమీ నిర్వాహకులు కరాటే మాస్టర్ ఫయాజ్ మాట్లాడుతూ మేయర్ బి. వై.రామయ్య చొరవతో పార్కులో ప్రతిరోజు సాధనను ఉచితంగా శిక్షణ ఇస్తున్నానన్నారు.కరాటే సాధన ద్వారా ఆత్మ రక్షణతో పాటు క్రమశిక్షణలో పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల,తల్లిదండ్రులు మాస్టర్లు పాల్గొన్నారు.
V.VKR