టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
కాగజ్నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ లోని ఎంఎంసీ క్రికెట్ మైదానంలో ఈనెల 7 న ప్రారంభమైన స్వర్గీయ వనమాల వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు (శుక్రవారం) ఫైనల్స్ కు చేరుకుంది. కాగా ఫైనల్లో 10వ వార్డు యువత విజయం సాధించారు. విజేతలకు మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, కోనేరు ఫణి. స్థానిక వార్డు కౌన్సిలర్ వనమాల విజయ రాములు కలిసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివ, ఎల్లేష్, వలీ, మినాజ్, సునీల్, నాయకులు జాకీర్ షరీఫ్, వసీం, దస్తగిరి, హాజీ, నాయకులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA