టెట్ వాయిదా కుదరదు:మంత్రి సబితా
తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహించే రోజే ఆర్ఆర్బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.దీంతో కేటీఆర్ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- By khaja --
- Saturday, 21 May, 2022
హైదరాబాద్: తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహించే రోజే ఆర్ఆర్బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.దీంతో కేటీఆర్ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్ చేశారు. ఈ నేపథ్యంలో సబిత స్పందిస్తూ.. ''ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ వాయిదా కుదరదు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం'' అని తెలిపారు. కాగా జూన్ 12న తెలంగాణలో టెట్ పరీక్ష జరగనుంది.
khaja