జోడేఘాట్ ను సందర్శించిన ఎంపీ.
జోడేఘాట్ ను సందర్శించిన ఎంపీ.
అసిఫాబాద్ : ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొమురం భీం జిల్లా జోడేఘాట్ లోని కొమురం భీం విగ్రహానికి నివాళలర్పించనున్న నేపద్యంలో బుధవారం రోజున అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సోయం బాబురావు తో కలిసి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ జోడేఘాట్ లోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హంశాఖామంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి పరిషోతం రూపాల ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ జోడేఘాట్ ను సందర్శించి కొమురం భీం విగ్రహాని నివాళులు అర్పించి 12 గ్రామాల ప్రజలతో మాట్లాడుతారని అనంతరం మర్లవయ్ గ్రామంలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత కానుక రాజు తో ముచ్చటించి జైనూర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కొట్నకా విజయ్, శేర్ల మురళి, జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, ఆదిలాబాద్ పార్లమెంట్ కొకన్వినర్ కలిపాక కిరణ్, బీజేపీ నాయకులు ఆత్మ రామ్ నాయక్, అదిలాబాద్ బీజేపీ నాయకులు కంధి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఉాధ్యక్షులు సునిల్ చౌదరీ, జిల్లా కోశదికారి అరుణ్ లోయ,సతీష్ బాబు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు.
KOTA SAIKRISHNA