గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన తరగతులు
గ్రంథాలయాలను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ అన్నారు. మే నెల 17 నుంచి బేతంచర్ల గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి
గ్రంథాలయాలను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ అన్నారు. మే నెల 17 నుంచి బేతంచర్ల గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మధు శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభ ను ఎంఈఓ పరీక్షించి బహుమతులు అందజేశారు. తరచు గ్రంథాలయాన్ని సందర్శించి మీ విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత లక్ష్యం వైపు పయనించాలని విద్యార్థులకు సూచించారు.
ఆంధ్ర హరితం న్యూస్