కండికొండ మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ సంస్కృతిని తన సాహిత్యం ద్వారా జనసామాన్యానికి తెలిపిన కందికొండ మరణం తెలంగాణకు తీరని లోటని కేటీఆర్ అన్నారు.
- By khaja --
- Saturday, 12 Mar, 2022
ప్రముఖ కవి, గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి మరణం పట్ల మంత్రి శ్రీ కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతిని తన సాహిత్యం ద్వారా జనసామాన్యానికి తెలిపిన కందికొండ మరణం తెలంగాణకు తీరని లోటని కేటీఆర్ అన్నారు. కందికొండ పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ సందర్భంగా కందికొండ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
khaja