ఆటో గేదె ఢీ పలువురు మహిళలకు గాయాలు
ఆటో గేదె ఢీ పలువురు మహిళలకు గాయాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామనికి చెందిన పలువురు మహిళలు సోమవారం వార సంతకు వెళ్లారు. సంత నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతున్న క్రమంలో చేనులో నుంచి ఓ గెదే పరుగులు తీస్తూ రోడ్డుపైకి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కౌటాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
KOTA SAIKRISHNA