అధిక ధరలను తగ్గించాలి సిపిఐ, సిపిఎం డిమాండ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని విద్యుత్ చార్జీలు బస్ చార్జీలు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను భారాలను తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈ రోజు స్థానిక గోస్పాడు మండలం జూలేపల్లి
- By khaja --
- Monday, 25 Apr, 2022
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని విద్యుత్ చార్జీలు బస్ చార్జీలు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను భారాలను తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈ రోజు స్థానిక గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామ సచివాలయం దగ్గర సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ చెన్నయ్య సిపిఎం పార్టీ మండల నాయకులు చెన్నయ్య ఎస్ మార్కు పాల్గొన్నారు ఈ సందర్బంగా పై నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు పేద ప్రజలకు అనేక రకాలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల, కోట్ల రూపాయల భారాలను ప్రజలపై మోపారని అన్నారు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు, విపరీతంగా పెంచిందని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర 400 ఉండేదని నేడు అది వెయ్యి రూపాయలు అయిందని కందిపప్పు నుంచి ఉప్పు దాకా అన్ని నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే బాటలో మన రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడం, కరెంట్ చార్జీలు, బస్ చార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా అనేక రకాలుగా పేద ప్రజలపై భారాలు వేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అదే బాటలో పయనించడం సిగ్గుచేటని అన్నారు ఇది చాలవన్నట్లు ఉగాది కానుకగా ప్రజలకు కరెంటు చార్జీలు పెంచి ఇప్పుడు మొన్న ఈస్టర్ పండుగ కానుకగా బస్సు చార్జీలు పెంచడం ప్రజలను వంచించడమేనని అన్నారు ఈ పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు బాబు రమేష్ రంగడు రాజు తదితరులు పాల్గొన్నారు.
khaja