2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. మాజీ జడ్పీ ఛైర్మన్

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని కలిగిన ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ 2 లక్షల చెక్కును హసన్ పల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద రాములుజయ

నిజాంసాగర్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని కలిగిన ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ 2 లక్షల చెక్కును హసన్ పల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద రాములుజయ లకు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే.ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి.మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ లు కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి.వాజిద్ అలీ. సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్.నాయకులు యటకారి నారాయణ. గార బోయిన వెంకటేశం.తదితరులు ఉన్నారు.

Abdul Raheem

Comment As:

Comment (0)