19న కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభం
19న కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ నుండి జిల్లాలో ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకు గాను అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎస్. పి. సురేష్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కొరకు 26: బృందాలు ఒక అదనపు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాహనాలు, 26 ఏ. ఆర్. మిషన్లు, ట్రయల్ లెన్స్ బాక్సులు, స్నెల్, విజన్ చార్ట్లు, కంటి వెలుగు కిట్లు, ట్యాబ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న శిబిరాలను సంబంధిత అధికారులు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, డి. ఎస్. పి. శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA