ps-A

హెచ్​ఐఈ స్కాలర్​షిప్​ టెస్ట్​కు దరఖాస్తుల ఆహ్వానం..

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (HIE) 12వ తరగతి విద్యార్థుల కోసం మెరిటోరియస్​ స్కాలర్​షిప్​ను ప్రకటించింది. ఎంపీసీ, బైపీసీ లేదా ఎంఈసీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉచిత రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు...

ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు(Private) సంస్థలు ముందకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (HIE) 12వ తరగతి విద్యార్థుల కోసం మెరిటోరియస్​ స్కాలర్​షిప్​ను ప్రకటించింది. ఎంపీసీ(MPC), బైపీసీ లేదా ఎంఈసీ(MEC) కోర్సులు చేస్తున్న విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉచిత రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు స్కాలర్​షిప్​ అందజేస్తుంది. స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ టెస్ట్ (HIESET) ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు అన్ని వివరాలను అందించడం ద్వారా అర్హత పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు​www.hieset.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలోని అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టాలెంట్​ సెర్చ్​ ప్రోగ్రామ్​ ద్వారా హెచ్​ఐఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. స్కాలర్​షిప్​ టెస్ట్​కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 28న వ్రాతపూర్వక అర్హత పరీక్షలను నిర్వహిస్తుంది.

హెచ్​ఐఈ స్కాలర్‌షిప్ టెస్ట్​కు ఎలా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి?

www.hieset.in వెబ్​సైట్​ను సందర్శించండి.

ఇక్కడ, 'న్యూ స్టూడెంట్​ రిజిస్ట్రేషన్​'పై క్లిక్ చేయండి.

మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.

మీ తండ్రి పేరు, తల్లి పేరు, వారి ఆధార్ నంబర్, వృత్తి, వార్షిక ఆదాయం వంటి కుటుంబ వివరాలను నమోదు చేయాలి.

మీ 10వ తరగతి బోర్డ్ GPA మార్కులు, విద్యా సంవత్సరం, వంటి ఇతర వివరాలను పొందుపర్చండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను జోడించండి.

వివరాలన్నీ సరిచూసుకొని రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించండి.

హెచ్​ఐఈ స్కాలర్‌షిప్​కు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ఇంటర్మీడియట్​ ఫ్రీ ఎడ్యుకేషన్​తో పాటు ఇంజినీరింగ్, మెడిసిన్​, సీఏ కోర్సుల్లో చేరేందుకు రాయాల్సిన పోటీపరీక్షలపై ఉచిత శిక్షణ కూడా ఉంటుంది. HIESET స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్​ను గియాసుద్దీన్ బాబుఖాన్ ఛారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ జకాత్, ఛారిటబుల్ ట్రస్ట్ దీనికి నిధులు సమకూరుస్తుంది.

హెచ్​ఐఈ అకాడమీ తెలంగాణలోని మడ్గుల్ చిట్టెంపల్లెలో ఉంది. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలలో కోర్సులను అందిస్తుంది. 12వ తరగతితో పాటు ఎంబీబీఎస్​, సీఏ, సీపీటీ, లాసెట్​, క్లాట్​, ఎంసెట్​, జేఈఈ మెయిన్స్, ఎంసెట్​+ నీట్​​ వంటి పోటీ పరీక్షల తయారీకి కూడా క్లాస్​ రూమ్​ కోచింగ్​ను అందిస్తుంది. గతేడాది హెచ్​ఐఈలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్​ఐటీ, ఇతర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది మంచి ఫలితాలు సాధించారు.


Comment As:

Comment (0)