మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను కట్టడి చేయాలి

మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను కట్టడి చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,గుమ్మితం తాండలో గత మంగళవారం

మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను కట్టడి చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,గుమ్మితం తాండలో గత మంగళవారం సాయంత్రం తండా మహిళ గ్రీన్కో పరిసర ప్రాంతాల్లో మేకలు మేపుతుండగా గ్రీన్ కోలో పనిచేస్తున్న కార్మికుడు ఆమెపై అఘాయిత్యానికి గురైన మహిళ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలమ్మ మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు కే.ఎస్.పద్మ నోమేశ్వరి, జయమ్మ ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలని పరమార్శించి, వారికీ భరోసా కల్పించారు. ఈ సందర్బంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు మాట్లాడారు. మహిళపై అఘాయిత్యం చేస్తున్న సందర్బంగా దగ్గరలో ఉన్న ఆమె అన్నను పిలుస్తూ... మహిళ కేకలు వేస్తుండగా రాళ్లతో కొట్టి నోరు మూసి పారిపోవడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఘటన స్థలానికి చేరుకున్న కర్నూలు డిఎస్పి మహేష్, కర్నూలు రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, స్థానిక ఎస్సై మల్లికార్జున, గ్రీన్ కో మేనేజ్మెంట్ నాయుడు లను కోరారు.మహిళా పైన అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని, భదిత మహిళ కుటుంబానికి, బాధితురాలికి న్యాయం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నాగన్న, సిఐటియు మండల కార్యదర్శి శ్రీధర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి.గురు శేఖర్ పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)