గోడ కూలి చనిపోయిన కార్మికునికి రూ.20 లక్షలు ఇవ్వాలి: సిపిఎం డిమాండ్.
కర్నూలు నగరంలోని,అలీ షేర్ బాగ్ వెళ్లే దారిలో బుధవారం కోట గోడ కూలి ఒక కార్మికుడు మృతి,మరో చిన్న బాలుడుకి కాలు విరిగిన ఘటన జరిగింది. గోడను ఈ మధ్యకాలంలోనే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేశారు
- By V.VKR --
- Wednesday, 20 Jul, 2022
కర్నూలు నగరంలోని,అలీ షేర్ బాగ్ వెళ్లే దారిలో బుధవారం కోట గోడ కూలి ఒక కార్మికుడు మృతి,మరో చిన్న బాలుడుకి కాలు విరిగిన ఘటన జరిగింది. గోడను ఈ మధ్యకాలంలోనే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. గోడను నాసిరకం కట్టడం వల్ల కూలిపోవడం జరిగిందని అన్నారు. దీంతో అక్కడే ఉన్న చిన్నయ్య అనే మూగ వ్యక్తి గోడ రాళ్లు పడి మృతి చెందడం బాధాకరం అన్నారు. చిన్నయ్యకు నలుగురు పిల్లలు ఉన్నారన్నారు.చిన్నయ్య చనిపోవడానికి ప్రధాన బాధ్యత నగరపాలక సంస్థ దే అని ఆగ్రహం చెందారు. నగరపాలక సంస్థ అధికారులకు ప్రజల మీద పన్నులు వేసి వసూలు చేయడం పట్ల ఉన్న దృష్టి ఇలాంటి కట్టడాలను జాగ్రత్తగా కట్టడంలో లేదన్నారు.వీరి నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఒక అమాయక కుటుంబం బలైపోయిందని చెప్పారు. కావున ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉందన్నారు.తక్షణమే ఆ కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరాహారం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.అలాగే కాలు విరిగిన బాలుడి కుటుంబానికి రూ.50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
V.VKR