వడగండ్ల బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి,దుమాల గ్రామాలలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కపల్లి
- By OGGU --
- Friday, 29 Apr, 2022
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి,దుమాల గ్రామాలలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కపల్లి,దుమాల గ్రామాలలో సుమారు 400 ఎకరాల వరి పంట గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతినడం జరిగిందని ఆయన అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టం జరిగినప్పుడల్లా సర్వేలు చేయడం తప్ప ఒక్క రూపాయి కూడా ఇచ్చిన సందర్భం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అకాల వర్షాలకు వడగళ్ల వానలకు రైతులకు నష్ట పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. కేవలం సర్వేలకు పరిమితం అవుతున్నాయి తప్ప రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు.వ్యవసాయ అధికారి భూమిరెడ్డి తో అక్కపల్లి శివారులో పంట నష్టం పరిశీలించిన అనంతరం రైతు సంతోష్ పొలం నష్టం గురించి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. తక్షణమే నష్టపోయిన రైతులకు 40 వేల రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సుడిది రాజేందర్, బానోతు రాజు నాయక్, గుడ్ల శ్రీనివాస్, చెన్ని బాబు,జంకే లచ్చిరెడ్డి లు పాల్గొన్నారు.
mahesh