'సేవకుల వర్గం' సృష్టికే ఆంగ్లేయుల విద్యా వ్యవస్థ: మోదీ

కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం కావద్దన్న ప్రధాని. వారణాసి: బ్రిటిషర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా 'సేవకుల వర్గాన్ని' సృష్టించడానికే భారత్‌కు విద్యా వ్యవస్థను ( Education System) అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం కావద్దన్న ప్రధాని. వారణాసి: బ్రిటిషర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా 'సేవకుల వర్గాన్ని' సృష్టించడానికే భారత్‌కు విద్యా వ్యవస్థను ( Education System) అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా వాటిలో చాలావరకు ఇంకా మారలేదని అన్నారు. జాతీయ విద్యా విధానంపై (NEP) వారణాసిలో జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన.. కేవలం డిగ్రీ పట్టా పొందిన వారిని కాకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన వనరులను అందించేలా దేశ విద్యావ్యవస్థ ఉండాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.జాతీయ విద్యా విధానంపై (NEP) యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, బెనారస్‌ హిందూ యూనివర్సిటీలతో కలిసి కేంద్ర విద్యాశాఖ మూడురోజుల పాటు సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోదీ.. 'దేశంలో ఉద్యోగాల కల్పనకు అనుగుణంగా మాత్రమే గతంలో ఆంగ్లేయులు విద్యా వ్యవస్థను రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. అయినా ఇంకా చాలా మారాల్సి ఉంది. కేవలం డిగ్రీ పట్టా పొందిన యువతను తయారు చేయవద్దు. దేశాన్ని మరింత ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సృష్టించేలా మన విద్యా వ్యవస్థను తయారు చేయాలి' అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇతరులకు సమాధానం చెప్పేందుకు పిల్లలు ఇప్పటికే గూగుల్‌ని ఉపయోగిస్తున్నారన్న మోదీ.. మరికొన్ని ఏళ్లలో అటువంటి పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు క్యాంపస్‌లు సిద్ధంగా ఉండాలన్నారు. భారతీయ భాషల్లో విద్యా వ్యవస్థ ఉండేందుకు జాతీయ విద్యావిధానం తలుపులు తెరుస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఉత్తమమైన విద్యకు భారత్‌ గమ్యంగా మారుతుందనే విశ్వాసం ఉందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలాఉంటే, నూతన విద్యా విధానం-2020 అమలుపై చర్చించేందుకు వారణాసిలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది విద్యావేత్తలు హాజరయ్యారు. వైస్‌ ఛాన్సలర్లు, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల డైరెక్టర్లు ఇందులో పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)