ఒకేరోజు ఎంసెట్‌, సీయూఈటీ.. మెయిల్‌ ద్వారా మార్చుకొనే అవకాశం

మెయిల్‌ ద్వారా ఎంసెట్‌ తేదీలు మార్చుకొనే అవకాశం ఎంసెట్‌ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్‌ కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్​‍ టెస్ట్ (సీయూఈటీ) కూడా ఉండటంతో

మెయిల్‌ ద్వారా ఎంసెట్‌ తేదీలు మార్చుకొనే అవకాశం ఎంసెట్‌ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్‌ కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్​‍ టెస్ట్ (సీయూఈటీ) కూడా ఉండటంతో రెండింటికి హాజరయ్యేవారు ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తున్నది. టీఎస్ ఎంసెట్‌ జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో జరుగనున్నది. సెంట్రల్‌ వర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీని కూడా జూలై 15, 16, 19, 20 తేదీలతోపాటు, ఆగస్టు 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. జూలై 15, 19, 20 తేదీల్లో రెండు పరీక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్లగా.. సీయూఈటీ కారణంగా ఎంసెట్‌ను వాయిదా వేయబోమని చెప్పారు. రెండింటికి హాజరయ్యే వారుంటే మరో రోజు పరీక్ష రాసుకొనే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి వారు. convener.eamcet@tsche.ac.in కు మెయిల్‌ చేయాలని సూచించారు. టీఎస్ ఎంసెట్‌కు 2,65,547 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్‌కు 1,71,500, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌కు 94,047 దరఖాస్తులు వచ్చాయి. రూ.2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌ శనివారం నుంచి ప్రారంభమైంది.

khaja

Comment As:

Comment (0)