6న హస్తినకు చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు..
- By khaja --
- Monday, 01 Aug, 2022
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
khaja