హిందూ దేవాలయాల ఆస్తులను కదిలిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదనీ,దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ ఈనెల మొదటి వారంలో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో సి.జి.ఎఫ్. (C.G.F) బకాయలు ఉన్న దేవాలయాలు త

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదనీ,దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ ఈనెల మొదటి వారంలో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో సి.జి.ఎఫ్. (C.G.F) బకాయలు ఉన్న దేవాలయాలు తమ సర్ ప్లస్ ఎఫ్.డి.లను రద్దు చేసి జూలై 15లోపు రూ.311 కోట్లు కట్టాలని ఈ.ఓ.లకు మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో రూ.2 లక్షలుపై వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు అన్ని బకాయిలు కట్టాలన్నారు. కాని 2022 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం వచ్చే దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదని స్పష్టంగా చెప్పింది.దీనినీ గౌరవ అత్యున్నత న్యాయస్థానం కూడా ధృవీకరించింది. కాని దేవాదాయ కమిషనర్ పై న్యాయస్థానం ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా రెండు లక్షలు పైన వార్షిక ఆదాయం వచ్చే దేవాలయాలు అన్నీ కూడా సి.జి.ఎఫ్.కట్టాలని ఈ.ఓ.లపై వత్తిడి చేస్తున్నారు.దీనిని విశ్వ హిందూ పరిషత్,అర్చక సంఘాలు, పాలక మండళ్లు, యావత్ హిందూ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇటువంటి విపరీత నిర్ణయాల వల్ల హిందూ దేవాలయ వ్యవస్థకు, అర్చకులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ప్రభుత్వం తలపెట్టిన ఈ పని దేవాదాయ చట్టం ప్రకారం, ప్రస్తుత ఉన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం చెల్లదు.కాబట్టి ప్రభుత్వం వెంటనే సదరు సీ.జీ.ఎఫ్.బకాయిన రద్దు చేసే విషయాన్ని బేషరతుగా వెంటనే విరమించుకోవాలనీ డిమాండ్ చేశారు. బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వై.యస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలు విపరీతంగా పెరిగాయనీ, హిందువులంతా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పుత్రుడిగా భావించి ప్రేమతో, గౌరవంతో మూకుమ్మడిగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే తమకు మంచి "బహుమానమే" దక్కిందనీ, ఇంకా దీనిని ఏమాత్రం సహించబోమని హిందూ దేవాలయాల ఆస్తుల రక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ , బజరంగ్దళ్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహిస్తామనీ తీవ్రంగా హెచ్చరించారు.జిల్లా ఉపాధ్యక్షులు లక్కిరెడ్ఢి అమరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండీ ఆలయాలపై దాడులు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరి, రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల తొలగించడం, అంతర్వేది రథం దహనం, వంటి సంఘటనల్లో దోషులను పట్టుకోమంటే అది పిచ్చివాళ్ళ పని అని కేసులు మూసేశారనీ ఒక్క సంఘటనలో కూడా దోషులను ఈనాటికీ పట్టుకోలేదనీ,హిందువుల పట్ల,హిందూ ఆలయాల పట్ల ఇంతటి ఉదాసీనత ఎందుకనీ ప్రశ్నించారు. నగర అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ వైయస్.ఆర్.సి.పి.ప్రభుత్వంలో పాస్టర్లకు, మౌల్వీలకు ప్రతినెలా గౌరవవేతనం ఇస్తున్నారు. కానీ ప్రైవేటు ఆలయాలు అర్చకులకు ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వడం లేదనీ,కానీ రాష్ట్రంలోని వేలాది ఆలయాల్లో కోట్లాది హిందూ భక్తులు ఇచ్చేకానుకలు ప్రభుత్వం అవసరాలకు వాడుకుంటున్నారనీ,లేనివారు శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు సరైన జీతాలు కూడా ఇవ్వడం లేదనీ దీనిని ఏమాత్రం సహించేది లేదనీ వెంటనే అర్చకులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,కోశాధికారి శ్రీనివాసులు,శివప్రసాద్,భరణి తదితరులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)