జిల్లా గ్రంధాలయంలో " నేషనల్ డిజిటల్ లైబ్రరి " సేవలు ప్రారంభం

కర్నూలు జిల్లా, పాత బస్టాండ్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం " నేషనల్ డిజిటల్ లైబ్రరి " సేవలను పాఠకుల సౌకర్యార్ధం సంస్థ అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యదర్శి కె. ప్రకాష్ మాట్లాడారు.ఈ నేషనల్ డిజిటల్ లైబ్రర

కర్నూలు జిల్లా, పాత బస్టాండ్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం " నేషనల్ డిజిటల్ లైబ్రరి " సేవలను పాఠకుల సౌకర్యార్ధం సంస్థ అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యదర్శి కె. ప్రకాష్ మాట్లాడారు.ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరి యొక్క - ముఖ్య ఉద్దేశం ఏమనగా , పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విధ్యార్థులకు డిజిటల్ లైబ్రరి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరి సేవలతో పాటు బ్రిటీష్ కౌన్సిల్ డిజిటల్ లైబ్రరి " సేవలు కూడా పాఠకులకు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. బ్రిటీష్ కౌన్సిల్ డిజిటల్ లైబ్రరి యందు సుమారు 100 దేశాల ఇ - న్యూస్ పేపర్స్ 8000 రకాల అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.సుమారు 8000 ఇ - మ్యాగజైన్స్, 1,20,000 ఇ - బుక్స్ , 40,000 ఇ - బర్నవింగ్ సాఫ్ట్ స్కిల్స్,పిల్లల కోసం 1900 డిజిటల్ : గ్రాఫిక్ నవల్స్ మరియు ఇ - రాక్స్ మొదలగునవి అందుబాటులో ఉన్నాయని అన్నారు. కావున ప్రతి పాఠకుడు జిల్లా కేంద్ర గ్రంధాలయం ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో గ్రంథాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)