కర్నూలు ట్రాఫిక్ , దిశా పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ

కర్నూలు ట్రాఫిక్,దిశా పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీసులకు పలు సూచనలు,సలహాలు చేశారు.స్టేషన్ లోని మ్యాప్ ను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు

కర్నూలు ట్రాఫిక్, దిశా పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. స్టేషన్ లోని మ్యాప్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన మేరకు ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ వర్క్ పెంచాలన్నారు.పోలీసు స్టేషన్ ల నిర్వహణ, సిబ్బంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్నారనే విషయాల గురించి ఆరా తీశారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ , ఓవర్ లోడింగ్ , సెల్ ఫోన్ డ్రైవింగ్ , తదితర ఉల్లంఘనలపై నమోదైన కేసులను సమీక్ష చేశారు. జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకలు సులువుగా సాగేలా మరియు రోడ్డు భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ యుగంధర్ బాబు, సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు,స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్,ట్రాఫిక్ సిఐ లక్ష్మమయ్య,ఎస్సై ముని ప్రతాప్ పాల్గొన్నారు.

V.VKR

Comment As:

Comment (0)