హిజాబ్ పేరుతో రాజకీయాలు ఆపాలి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సమీన అన్వరుద్దీన్

కర్ణాటకలో హిజాబ్ పేరుతో జరుగుతున్న వివాదాన్ని హాలియ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సమీనా అన్వరుద్దీన్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

కర్ణాటకలో హిజాబ్ పేరుతో జరుగుతున్న వివాదాన్ని హాలియ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సమీనా అన్వరుద్దీన్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. విభిన్న మాతాలకు,ఆచారాలకు నిలయమైన భారతదేశంలో ప్రతిఒక్కరికి పరమత సహనం అవసరమని అన్నారు. హిజాబ్ పేరుతో రాజకీయాలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మతమేదైనా మనమంతా భారతీయులమే అన్న విషయాన్ని మరిచి పోవద్దన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో దుష్టశక్తులకు భయపడకుండా ధైర్యం ప్రదర్శించిన ముస్కాన్ ఖాన్ కు తన హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బేగం,షేక్ నసీమా సుల్తాన,సయ్యద్ నూర్జహా, మహమ్మద్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Anwar

Comment As:

Comment (0)