సిసి రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
మండలంలోని అన్ని గ్రామాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను ఆరోపించారు, ఈ సందర్భంగా మంగళవారం స్థానికంగా ఎంపీడీవో కు వినతిప
- By khaja --
- Tuesday, 29 Mar, 2022
మండలంలోని అన్ని గ్రామాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను ఆరోపించారు, ఈ సందర్భంగా మంగళవారం స్థానికంగా ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు, గ్రామాలలో సిసి రోడ్ల పనులను సర్పంచులు గుత్తేదారులకు అప్పగించారని, గుత్తేదారులు నాణ్యత పాటించకుండా, డస్ట్, నాసిరకం ఇసక వినియోగిస్తున్నారని, సిమెంటు తక్కువగా వాడుతూ నాసిరకంగా పోస్తున్నారని వారు ఆరోపించారు, పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ రాజ్ అధికారులు సర్పంచ్, గుత్తేదారుల తో కుమ్మక్కై చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, వారన్నారు, కమీషన్లకు అలవాటు పడ్డ అధికారులు పనులను పరిశీలించకుండా నాసిరకం పనులను ప్రోత్సహిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారన్నారు, సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అవినీతి అక్రమాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, మండల నాయకులు కోమాండ్ల గురవయ్య, వింజమూరు పుల్లయ్య, పాల్గొన్నారు
khaja