సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం మనది

సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం మనది

అసిఫాబాద్ నవంబర్26, :ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గొప్పదిగా గుర్తింపు పొందిన రాజ్యాంగం మనది అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం సర్వసత్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం అని, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వేచ్ఛను, అంతస్తులు, అవకాశాలను కల్పించడంలో సమానత్వం అందేలా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. అనంతరం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో రాజ్యాంగంలోని సూత్రాలపై ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం చూపిన మార్గంలో విధులను నిర్వహిస్తూ, నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Banka Srinivas

Comment As:

Comment (0)