మీటర్ బాక్స్ ఏర్పాటును పరివేక్షిస్తున్న కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్

మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ, రాజీవ్ గృహకల్పలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో భాగంగా రూ.63లక్షలతో ప్రారంభించిన ఎలక్ట్రిక్ మీటర్ బాక్సులను10వార్డ్ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ అధికారులతో కలసి పర్యవేక్షించారు

మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ, రాజీవ్ గృహకల్పలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో భాగంగా రూ.63లక్షలతో ప్రారంభించిన ఎలక్ట్రిక్ మీటర్ బాక్సులను10వార్డ్ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... రాజీవ్ గృహకల్ప లో ఎన్నో సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న మీటర్ బాక్స్ ల సమస్యను స్థానిక కౌన్సిలర్ తో కలిసి తాను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి మల్లారెడ్డి ఉన్నతాధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్న మంత్రి లో ఆయనకు మొదటి స్థానం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలు నాయకులు వారికి ఎంతో రుణపడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, కాలనీ మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ వార్డ్ సభ్యులు వెంకటేష్, యాది ముదిరాజ్ , వినయ్ కుమార్, శ్రీనివాస్, దుర్గ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Gade

Comment As:

Comment (0)